మహబూబ్‌నగర్ జిల్లా నెల్లికొండ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. చిన్న చింతకుంట మండల కేంద్రానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి ఊర్లోనే కిరాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మహబూబ్‌నగర్‌కు వెళ్లి అవసరమైన కిరాణ సరుకులు తీసుకుని ద్విచక్రవాహనంపై మరో మిత్రునితో కలిసి స్వగ్రామానికి బయల్దేరారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనే సమయంలోనే నెల్లికొండి గ్రామం సమీపానికి రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు - అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి
మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కిరాణ సరుకలు తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా... ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు
ఘటనలో నరసింహులు తలకు తీవ్రగాయాలయ్యాయి. వెనకాల ఉన్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 108 వాహనంలో నరసింహులును జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా