మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని విజయ నర్సింగ్ పాఠశాలలో విద్యను అభ్యసించి గత మూడేళ్లుగా అదే పాఠశాలలో నర్సుగా పనిచేస్తున్నారు మాధవి. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మాధవికి నిన్న నుంచి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏ కారణం చేతనో తనకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని కుటుంబ సభ్యులకు మృతురాలు చెప్పినట్లు సమాచారం.
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి - railway_track
రోగుల గాయాలు మానిపించి... మందులు ఇచ్చి సేవలు చేసే ఆ సున్నిత మనస్కురాలు తనకు కలిగిన కష్టానికి మందు వేసుకోలేక పోయింది. మూడేళ్లుగా నర్సుగా విధులు నిర్వహిస్తూ పనిలో క్రమశిక్షణ పాటించిన ఆ యువతి క్షణికావేశంలో చావే శరణ్యమనుకుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడమే కారణంగా తెలుస్తున్నా... ఆమెది హత్యో, ఆత్మహత్యో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
యువతి మృతి
హత్యా..? ఆత్మహత్యా?
నర్సుగా విధులు నిర్వహిస్తున్న మాధవి క్రమశిక్షణతో ఉండేదని సహోద్యోగులు తెలిపారు. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందో... పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: మావోల దాడిలో ఎమ్మెల్యే సహా నలుగురు మృతి