తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబ్​నగర్ పురపాలికలో అవిశ్వాస రగడ - ఛైర్మన్​ను గద్దె దింపేందుకు వ్యూహాలు - Mahabubnagar Municipality

No Confidence Motion in Mahabubnagar Municipality : మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్​ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. మహబూబ్‌నగర్ పురపాలిక ఛైర్మన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. గులాబీ పార్టీ తిరుగుబాటు కౌన్సిలర్లు సహా కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ నేతలు కలిసి ప్రస్తుత ఛైర్మన్‌ని గద్దె దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కలెక్టర్‌కు తీర్మాన ప్రతులు అందించారు.

Mahabubnagar Municipality
Mahabubnagar Municipality

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 11:22 AM IST

Updated : Jan 7, 2024, 11:27 AM IST

మహబూబ్​నగర్ పురపాలికలో అవిశ్వాస రగడ

No Confidence Motion in Mahabubnagar Municipality :మహబూబ్‌నగర్ పురపాలిక ఛైర్మన్ నర్సింహులుపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీలో అభివృద్ధి జరగట్లేదని, వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండి పోయాయని ఆరోపిస్తూ 32 మంది కౌన్సిలర్లు ఛైర్మన్‌పై అవిశ్వాసం (No Confidence Motion) ప్రకటిస్తూ తీర్మానించారు. వారు సంతకాలు చేసిన తీర్మాన ప్రతులను జిల్లా కలెక్టర్‌కి అందించారు.

గులాబీపార్టీ తిరుగుబాటు కౌన్సిలర్ ఆనంద్​గౌడ్ సహా, పలువురు బీఆర్ఎస్ నేతలు, ఐదుగురు కాంగ్రెస్, నలుగురు ఎంఐఎం, ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు అందులో ఉన్నారు. ఆ తీర్మానంపై కలెక్టర్ 15 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే తప్పకుండా నెగ్గుతామని, నర్సింహులును ఛైర్మన్ పదవి నుంచి దింపి తీరుతామని హస్తం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No Confidence Motion On Chairman By Councillors: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. 2020 పురపాలిక ఎన్నికల్లో 30 మంది బీఆర్​ఎస్ కౌన్సిలర్లు గెలవగా, ఛైర్మన్‌గా నర్సింహులుని ఎన్నుకున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్‌పై, గులాబీ పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేసి కాంగ్రెస్‌కి మద్దతుగా పని చేశారు.

బెల్లంపల్లి పురపాలికలో అవిశ్వాసం రగడ - హీటెక్కిస్తున్న క్యాంపు రాజకీయాలు

Mahabubnagar Municipal Chairman No Confidence :రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, బీఆర్ఎస్ ఛైర్మన్‌ను ఎలాగైనా గద్దె దించాలని హస్తం నాయకులు భావిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. హస్తం పార్టీ, ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు అంతా కలిసినా ఆ అధిక్యం లేకపోవడంతో, గులాబీ పార్టీ తిరుగుబాటు కౌన్సిలర్ల సాయంతో ఛైర్మన్‌ను గద్దె దింపేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ బీ ఫాం​పై గెలిచి ఇతర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడాన్ని నర్సింహులు తీవ్రంగా ఖండించారు.

' మా పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లపైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు మారవచ్చు. కానీ పార్టీ భీ ఫాం ఇచ్చి టికెట్ తీసుకుని, ఆ పార్టీ నుంచి కౌన్సిలర్​గా గెలిచిన వ్యక్తి అదే పార్టీకి రాజీనామా చేస్తే హుందాతనం ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్లని కాంగ్రెస్​లో చేర్చుకోవడం ఎంతవారకు కరెక్ట్ అని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నా.' - నర్సింహులు, మహబూబ్​నగర్ పురపాలిక ఛైర్మన్

No Confidence Motions in Telangana Municipalities :అవిశ్వాసం నెగ్గడం సంగతి పక్కన పెడితే,అవిశ్వాసం తర్వాత ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్లు సహా ఇతర పార్టీ నేతల మద్దతుతో, కాంగ్రెస్‌ అభ్యర్థినే ఛైర్మన్ చేయాలని కొందరు హస్తం పార్టీ నాయకులు భావిస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన మరో కౌన్సిలర్ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపాలికల్లో రగడ - ఛైర్మన్‌లకు అవిశ్వాసం సెగ

ఆర్మూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్​పై నెగ్గిన అవిశ్వాసం - పదవి కోల్పోయిన వినీత

Last Updated : Jan 7, 2024, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details