మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లోకి వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి విక్రయానికి వచ్చింది. గత వారం క్వింటాల్ ఉల్లి కనిష్ఠంగా రూ.3,100, గరిష్ఠంగా రూ.4,200 వరకు కొనసాగింది. కొత్త ఉల్లి రాకతో క్వింటాల్ ధర సుమారు రూ.700 వరకు తగ్గి, రూ.3500 కొనసాగింది.
దేవరకద్ర మార్కెట్కు కొత్త ఉల్లి.. వ్యాపారుల ఆసక్తి
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లోకి కొత్త ఉల్లి అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ ధర రూ.3500 వరకు ఉండగా.. ఉల్లిని కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రయ, విక్రయదారులతో మార్కెట్ కళకళలాడుతోంది.
దేవరకద్ర మార్కెట్కు కొత్త ఉల్లి.. వ్యాపారుల ఆసక్తి
మరోవైపు ఇతర మార్కెట్లలో ఆశించిన స్థాయిలో ఉల్లి లభించకపోవటం వల్ల వ్యాపారులు సైతం ఇక్కడ ఉల్లిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు మార్కెట్కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.