ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభించాయి. ఆదివారం కాస్త తగ్గిన.. సోమవారం రికార్డు స్థాయిలో 697 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 197, జోగులాంబ గద్వాల 160, నాగర్‌కర్నూల్ జిల్లాలో 144, వనపర్తి జిల్లాలో 133, నారాయణపేట జిల్లాలో 60 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు వందలకు చేరువగా కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో 77, గ్రామీణంలో 7, జడ్చర్ల 28, గండీడ్ 20, దేవరకద్ర 18, భూత్పూర్ 13, సీసీకుంట 10, బాలానగర్ 7, హన్వాడ 6, నవాబుపేట 4, కోయిల్‌కొండ, అడ్డాకులలో ముగ్గురు చొప్పున కరోనా బారిన పడ్డారు. సీసీకుంట, మూసాపేటకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 160కేసులకు గాను.. గద్వాల జిల్లా కేంద్రంలో 24, అయిజ 27, గట్టు, మానవపాడు 16 చొప్పున, అలంపూర్ 13, వడ్డేపల్లి 12, క్యాతూర్ 10, ధరూర్ 9, ఇటిక్యాల 8, రాజోలి 7, మల్దకల్ మండలంలో 5 మందికి కరోనా నిర్ధరణ అని తేలింది.