మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎంపీ రేవంత్రెడ్డి - ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో ఎంపీ రేవంత్ రెడ్డి
మహబూబ్నగర్ జిల్లా కొండగల్లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎంపీ రేవంత్రెడ్డి
అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్