తెలంగాణ

telangana

తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు: ఓటర్ల ఆవేదన

By

Published : Mar 14, 2021, 5:50 PM IST

పోలింగ్ బూత్​ల్లో సౌకర్యాలు లేవంటూ పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందితో పాటు ఓటు వేసేందుకు వచ్చిన వారికి మంచి నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

mlc voters phase lot of problems in polling centers in mahabubnagar district
తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు: ఓటర్ల ఆవేదన

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చేవారికి ఇబ్బందులు తప్పలేదు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందితో పాటు ఓటు వేసేందుకు వచ్చిన వారికి మంచి నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల కోసం ఉంచాల్సిన వీల్‌ చైర్​ను ఏర్పాటు చేయలేదు.

పోలింగ్‌ కేంద్రంలో కేవలం ఒకటే ఓటు వేసే గది ఉండటంతో ఓటర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఎక్కువ సమయం పడుతుందని పలువురు ఓటర్లు తిరిగి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన మహబూబ్​నగర్ సహాయ రిటర్నింగ్ అధికారి సీతారామారావు, మరో మూడు గదులను ఏర్పాటు చేయలని ఆదేశించారు. ఉదయం మందకొడిగా ఉన్న ఓటర్లు.. మధ్యాహ్నానికి ఒక్కసారిగా పోలింగ్‌ కేంద్రాలకు రావటంతో రద్దీ ఏర్పడింది.

ఇదీ చదవండి: భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిపై దాడి..!

ABOUT THE AUTHOR

...view details