మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో విర్చూ ఫార్మా పరిశ్రమ సహకారంతో 60 లక్షల వ్యయంతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ వార్డును ప్రారంభించారు. పేద ప్రజల కోసం 20 పడకలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహమ్మారి పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌తోపాటు అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆసుపత్రిలో 20 పడకల కొవిడ్ వార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే - ఆక్సిజన్ ప్లాంట్
కొవిడ్ బాధితులకు ప్రభుత్వపరంగా ఉచిత సేవలు అందించేందుకు... మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఆసుపత్రిలో 20 పడకల కొవిడ్ వార్డును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. విర్చూ ఫార్మా పరిశ్రమ సహకారంతో 60 లక్షల వ్యయంతో ఆ వార్డును ఏర్పాటు చేశారు.
అంతకుముందు జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలంలో మోతీ గణపురం, పెద్దయ్య పల్లి, కేతిరెడ్డి పల్లిలో ఏర్పాటు చేసిన రైతు భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. బాలానగర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. సీఎం సహాయనిధి మంజూరైన లబ్ధిదారులకు లక్షా 76 వేల చెక్కులను అందజేశారు. కొవిడ్ వార్డు ప్రారంభోత్సవంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శివకుమార్, జడ్చర్ల పుర ఛైర్పర్సన్ లక్ష్మి, నాయకులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Uttam: ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి... చికిత్స చేయాలి