తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊక చెట్టు వాగుపై.. చెక్ డ్యామ్​కు ఎమ్మెల్యే భూమి పూజ - మహబూబ్​నగర్ జిల్లా వార్తలు

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న రాజగోపురాన్ని ఆయన పరిశీలించారు. పనులు వేగంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

MLA Ala Venkateshwar Reddy
శ్రీ కురుమూర్తి స్వామి ఆలయం

By

Published : Apr 8, 2021, 8:28 PM IST

మహబూబ్​నగర్ జిల్లా అమ్మాపూర్​లో.. శ్రీ కురుమూర్తి స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి.. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండపైకి మట్టి రోడ్డు వేసిన దాతలను ఆయన ఘనంగా సన్మానించారు.

ఆలయ కమిటీ సభ్యులు.. ప్రమాణస్వీకారానికి పరిమితం కాకుండా క్రమం తప్పకుండా వస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎదులాపురం ఊక చెట్టు వాగుపై రూ.8 కోట్లతో చేపట్టనున్న చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, పార్టీ మండల అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు

ABOUT THE AUTHOR

...view details