మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో జరుగుతున్న కబడ్డీ పోటీలను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీక్షించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్న మంత్రి... క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో జరుగుతున్న కబడ్డీ పోటీలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు.
కురుమూర్తి గ్రామంలో జరుగుతున్న కబడ్డీ క్రీడాకారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రామంలోని శ్రీ వీరహనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. నిర్వాహకుల కోరిక మేరకు మైదానంలోకి వచ్చిన మంత్రి... కబడ్డీ పోటీలను ఆసక్తిగా తిలకించారు.