తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2021, 5:40 PM IST

ETV Bharat / state

'జగ్జీవన్​రామ్ ఆశయ సాధనం కోసం అందరూ కృషి చేయాలి'

జగ్జీవన్​రామ్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు అర్పించారు. జగ్జీవన్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లైనా దేశంలో అసమానతలు తొలగిపోలేదని అన్నారు.

minister srinivas goud, babu jagjivan birth anniversary
మంత్రి శ్రీనివాస్ గౌడ్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి

మనుషులంతా సమానమన్న బాబు జగ్జీవన్​రామ్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జగ్జీవన్ 114 వ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన తెలంగాణ కూడలిని, బాబు జగ్జీవన్​రామ్ కాంస్య విగ్రహాన్నీ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లైనా దేశంలో అసమానతలు తొలగిపోలేదని అన్నారు. రిజర్వేషన్ల ద్వారా ఎదిగిన వాళ్లు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గడియారం చౌరస్తా వద్ద అంబేడ్కర్, సేవాలాల్ మహారాజ్, జ్యోతిబా పూలే వంటి మహనీయుల విగ్రహాలను పెడతామని తెలిపారు. మహనీయుల చరిత్ర తెలిసేలా జంక్షన్ల వద్ద వారి విగ్రహాలను నెలకొల్పుతామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకటరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మండే వేసవిలో చల్లచల్లని లస్సీ తాగేద్దామా...!

ABOUT THE AUTHOR

...view details