తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.30వేలకే చికిత్స అందించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌ యాజమాన్యాలతో మంత్రి సమావేశమయ్యారు . ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం 30 వేల రూపాయలకే వారం రోజుల పాటు కరోనా రోగులకు చికిత్స అందించాలన్నారు.

srinivas goud
srinivas goud

By

Published : May 21, 2021, 7:46 PM IST

రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కేవలం 30 వేల రూపాయలకే వారం రోజుల పాటు కరోనా రోగులకు చికిత్స అందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌ మానవతా దృక్పథంతో సేవలందించాలని అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌ యాజమాన్యాలతో మంత్రి సమావేశమయ్యారు. 20 శాతం బెడ్లను పేద కరోనా బాధితులకు ఉచితంగా.. లేదంటే నామమాత్రపు ఫీజుతో వైద్యం అందించాలని సూచించారు. సిటీ స్కానింగ్ రూ.1999కే చేయాలని వెల్లడించారు.

రెండు, మూడు దవాఖానల్లో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిందని వ్యాఖ్యానించారు అలాంటి పనులు మానుకోవాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మంత్రి సూచన మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్‌ యాజమాన్యాలు అందరూ కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వైద్య పరీక్షల రేట్లను ప్రకటించారు.

ప్రభుత్వానికి కేటాయించే 20 శాతం బెడ్లలో వసూలు చేసే చార్జీలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాథమిక రక్త పరీక్షలు, మందులు కలిపి ఆరు రోజుల వైద్యం కోసం ఆక్సిజన్ లేకుండా వైద్య సదుపాయాలు కల్పించినందుకు గాను రూ.30,000 వేలుగా నిర్ణయించారు. అలాగే ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే రూ.60,000 చెల్లించాలని వివరాలను వెల్లడించారు.

ఇదీ చదవండి:సెంట్రల్​ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట

ABOUT THE AUTHOR

...view details