మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను మంత్రి పరిశీలించారు. ప్రజా వేదికలో భాగంగా 44 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి... ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
'మహిళలు స్వయంశక్తితో ఎదగాలి... సమాజానికి సేవలు అందించాలి'
మహిళలు స్వయం శక్తితో ఎదిగి కుటుంబంతో పాటు, సమాజానికి సేవలు అందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇంటివద్దనే ఉంటూ టైలరింగ్‌తో పాటు ఎంబ్రాయిడరీ పనులలో శిక్షణ తీసుకోవాలని సూచించారు.
'మహిళలు స్వయంశక్తితో ఎదగాలి... సమాజానికి సేవలు అందించాలి'
అనంతరం జిల్లా షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 60 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళలు స్వయంశక్తితో ఎదిగి కుటుంబంతో పాటు సమాజానికి సేవలు అందించాలన్నారు. ఇంటి వద్దనే ఉంటూ స్వయంశక్తితో అభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళలకు టైలరింగ్‌తో పాటు ఎంబ్రాయిడరీ పనులలో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త : సీఎస్