తెలంగాణలో సర్వ మతాల పండుగలను ప్రశాంతంగా, ఐక్యంగా నిర్వహించుకునేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బక్రీద్ సందర్బంగా ఈద్గా వద్ద జరిగిన ప్రార్ధనల్లో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాహ్ని ప్రార్థించినట్లు చెప్పారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఈద్గాకు చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ ప్రార్థనల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ - బక్రీద్ పార్థనల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్
బక్రీద్ పర్వదినం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
బక్రీద్ పార్థనల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్
TAGGED:
మహబూబ్నగర్