రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో పర్యటించారు. చిరువ్యాపారులతో మాట్లాడారు. పక్కనే ఉన్న నిమ్మకాయ సోడా బండి దగ్గరకు వెళ్లి స్వయంగా సోడా తయారు చేసుకున్నారు. రసాన్ని పిండుకుని సోడా కలుపుకుని తాగారు.
నిమ్మకాయ సోడా కలిపిన మంత్రి - మహబూబ్నగర్ జిల్లా వార్తలు
మండుటెండలో దాహం తీర్చుకునేందుకు స్వయంగా మంత్రే నిమ్మకాయ సోడా తయారు చేసుకుని తాగారు. తనతోపాటు పక్కనున్న శాసనసభ్యుడికి చేసిచ్చారు రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో పర్యటించారు.
నిమ్మకాయ సోడా కలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
పక్కనే ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికీ నిమ్మకాయ సోడా అందించారు. లాక్డౌన్ నిబంధలు అందరూ పాటించాల్సిందేనన్న ఆయన.. మాస్కులు ధరించాలని, దూరాన్ని పాటించాలని సూచించారు. చిరువ్యాపారులకు మాస్కులను పంపిణీ చేశారు.