రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతి పట్ల పలువురు మంత్రులు, నేతలు సంతాపం ప్రకటించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో మంత్రి తండ్రి మృతి చెందగా.. పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో ఉంచారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఎర్రబెల్లి పరామర్శ
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతి పట్ల పలువురు మంత్రులు, నేతలు సంతాపం ప్రకటించారు. మంత్రి తండ్రి పార్థివ దేహానికి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని పరామర్శించిన ఎర్రబెల్లి
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , అంజయ్య యాదవ్, ముఠా గోపాల్, హర్షవర్ధన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహం, టూరిజం ఎండీ మనోహర్‌లు తదితరులు నారాయణ గౌడ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. పాలకొండలోని మంత్రి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇదీ చదవండి:శ్రీనివాస్ గౌడ్ తండ్రి మృతి పట్ల ప్రముఖుల సంతాపం