మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో ఉన్న 29 గ్రామ పంచాయతీల కార్మికులకు మండలంలోని మెడికల్ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో సుమారు వందమంది కార్మికులకు అవసరమైన నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ దుకాణాల నిర్వాహకులను అధికారులు అభినందించారు. మండల పరిధిలో దూరంగా ఉన్న గ్రామాలకు నిర్వాహకులే వెళ్లి నిత్యావసర సరకులను పంచిపెట్టారు.
మెడికల్ షాపుల సంఘం ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - corona virus
కరోనా కట్టడిలో గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు దేవరకద్ర మండలంలోని మెడికల్ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను అందజేశారు.
మెడికల్ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ