తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబ్​నగర్​ ఎంపీపీ పీఠం తెరాసదే.. - minister

మహబూబ్​నగర్​ మండల పరిషత్ ఛైర్మన్, వైస్​ ఛైర్మన్ పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్​గా సుధాశ్రీ, వైస్​ ఛైర్మన్​గా అనిత, కో-ఆప్షన్​ సభ్యుడిగా మహ్మద్​ మస్తాన్​లు ఎన్నికయ్యారు.

మహబూబ్​నగర్​ ఎంపీపీ పీఠం తెరాసదే

By

Published : Jun 15, 2019, 9:11 PM IST

మహబూబ్‌నగర్‌ ఎంపీపీ పీఠానికి ఈ నెల 7న ఎన్నిక జరగాల్సి ఉండగా.. నిర్ణీత సమయం దాటి కో-ఆప్షన్డ్‌ సభ్యుడి నామపత్రాలు దాఖలు కావడం వల్ల అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. ఉదయం 10 గంటలలోపు నామపత్రాలు దాఖలు చేయవల్సి ఉండగా.. ఉదయం 10 గంటల 50 నిమిషాలకు నామపత్రాలు దాఖలు చేయడం వల్ల ఎంపిక వాయిదా పడింది. ఎన్నికల అధికారుల ఆదేశాలతో శనివారం తిరిగి మండల పరిషత్ ఛైర్మన్, వైస్​ ఛైర్మన్, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాలు తెరాస కైవసం చేసుకోవడం వల్ల మండల పరిషత్ ఛైర్మన్​గా సుధాశ్రీ, వైస్​ ఛైర్మన్​గా అనిత, కో-ఆప్షన్‌ సభ్యుడిగా మహ్మద్‌ మస్తాన్​లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు.

మహబూబ్​నగర్​ ఎంపీపీ పీఠం తెరాసదే

ABOUT THE AUTHOR

...view details