మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 41వ వార్డు 198వ పోలింగ్ కేంద్రంలో ఇవాళ జరిగిన రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 22వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఇద్దరు మహిళలు టెండర్ ఓట్లు దాఖలు చేయడం వల్ల ఆ బూత్‌లో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. ఇవాళ ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. పటిష్ఠ బందోబస్తు, కమిషన్ సూచించిన ధ్రువపత్రాలు చూసిన తర్వాతే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు.
మహబూబ్‌నగర్‌లో రీపోలింగ్ 59.75 శాతం - మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 41వ వార్డు 198వ పోలింగ్ కేంద్రంలో ఇవాళ జరిగిన రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 718 ఓట్లు ఉండగా పోలింగ్ ముగిసే సమయానికి 429 ఓట్లు పోలయ్యాయి. 59.75 పోలింగ్ శాతం నమోదైంది.
మహబూబ్‌నగర్ రీపోలింగ్ 59.75 శాతం
మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మహిళా పోలీసులతో ఓటర్ల గుర్తింపు సరిగ్గా ఉందని తేల్చూకున్నాకే కేంద్రంలోకి పంపించారు. మొత్తం 718 ఓట్లు ఉండగా పోలింగ్ ముగిసే సమయానికి 429 ఓట్లు పోలయ్యాయి. 59.75 పోలింగ్ శాతం నమోదైంది. 206 మంది పురుషులు, 223 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదీ చూడండి : మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు