పార్టీ కోసం పనిచేస్తున్నవారికి తప్పకుండా ఫలితం దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఛైర్మన్‌గా ఎన్నికైన నరసింహులు, వైస్ ఛైర్మన్ గణేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కేసీఆర్ పాలనలో అందరిని కలుపుకొని పోతామన్నారు.
'పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది' - మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తామని.. పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన నరసింహులు బాధ్యతలు చేపట్టారు.
'పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది'
మహబూబ్ నగర్‌ను అభివృద్ధే చేస్తామని.. పేదలకు న్యాయం జరిగేటట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ పాలమూరులో ఎవరూ కూడా ఆరోగ్యం కారణంగా అప్పుల పాలవ్వకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పలువురికి చెక్కులు పంపీణి చేశారు.
ఇవీ చూడండి:సమత హత్యాచార కేసు నిందితులకు మరణ శిక్ష