మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగాపూర్‌లో లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి మొదలై తెల్లవారుజాము వరకు వేలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది.
పుష్పాలతో అలంకరించిన రథాన్ని వేద మంత్రాల మధ్య ముందుకు లాగారు. ఉత్సవాల్లో జిల్లా నుంచే కాకా రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు పాల్గొంటున్నారు. వేలాది మంది తరలిరావడంతో బందోబస్తు చర్యలు చేపట్టారు. వారం రోజుల పాటు జరిగే ఈ రథోత్సవాల్లో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.