తెలంగాణ

telangana

'ప్రజారోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం'

మహబూబ్​నగర్​ జిల్లాలో గ్రామ పంచాయతీలకు, పురపాలికలకు అవసరమైనన్ని నిధులు ఉన్నాయని కలెక్టర్​ ఎస్​. వెంకట రావు పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

By

Published : Jun 8, 2020, 11:55 PM IST

Published : Jun 8, 2020, 11:55 PM IST

Mahabubnagar district collector Venkata Rao review meeting on Seasonal disease
ప్రజారోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం

మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ ఎస్​. వెంకట రావు సీజనల్​ వ్యాధుల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ద్వారా, దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో డిస్‌ ఇన్ఫెక్షన్ కెమికల్స్‌ను పిచికారీ చేయాలని తెలిపారు.

అనంతరం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ పనుల వినియోగం నిమిత్తం గుర్తించిన ప్రాంతాల నుంచి ఇసుక సరఫరాకు ఆమోదించారు. జిల్లాలోని అల్లిపూర్, వర్నే, లింగంపేట, నెక్కొండ చెక్ డ్యాముల నుంచి ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న ఒడిశా కూలీలందరినీ తక్షణమే వారి స్వస్థలాలకు పంపించాలని కలెక్టర్ వెంకట రావు జిల్లా అధికారులను ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details