'మిగిలింది 16 రోజులే.. గ్రామ సమస్యలపై దృష్టి పెట్టండి' - collecter
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ జడ్చర్ల మండలంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక పాల్గొన్నారు. అధికారులుకు 16 రోజులే మిగిలి ఉన్నందున ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో సమస్యలు తీరిపోవని.... ఇదే ఒరవడిని ఎప్పుడూ కొనసాగిస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 30 రోజుల్లో ఇప్పటికీ మిగిలి ఉన్న 16 రోజులు ప్రజల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి అనే అంశంపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.
అనంతరం బాదేపల్లి పురపాలికలు డెంగీ, మలేరియా వ్యాధుల నివారణపై అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ ఇతర అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
TAGGED:
collecter