మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పీహెచ్‌సీని కలెక్టర్ వెంకట్రావు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి.. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇన్సెంటివ్ కేర్ సెంటర్‌కు అవసరమైన సౌకర్యాలపై వైద్యులతో చర్చించారు. నియోజకవర్గంలోని 5 పీహెచ్‌సీలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసిన స్థానిక స్నేహ ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
లాక్‌డౌన్‌తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది: కలెక్టర్ - ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
కరోనా కట్టడిలో ప్రజలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావు కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి దేవరకద్ర పీహెచ్‌సీని సందర్శించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇన్సెంటివ్ కేర్ సెంటర్‌కు అవసరమైన సౌకర్యాలపై వైద్యులతో చర్చించారు.
mahabubnagar collector
జిల్లాలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో 34 శాతం ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య.. 7 శాతానికి పడిపోయినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా కట్టడిలో ప్రజలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. కృష్ణ, ఇతర వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:KTR Respond: యువకుడి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందన