తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలి'

మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కలెక్టర్​ వెంకట్​రావు ప్రారంభించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడాలని తెలిపారు.

'పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలి'
'పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలి'

By

Published : Jun 1, 2020, 1:53 PM IST

జూన్ 1 నుంచి 8 వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని... మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిథులు ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొనాలని కలెక్టర్ ఎస్. వెంకట్​రావు ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉండటం వల్ల 8 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో గ్రామ పంచాయతీల పరిధిలోని నీటి నిలువ గుంతలను పూడ్చివేయాలని, దోమలు అభివృద్ధి చెందకుండా అరికట్టాలని, చెత్తా చెదారాన్ని తొలగించటంతో పాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. గ్రామాలలో డ్రైనేజీలు శుభ్రం చేయించడంతో పాటు మురికికాలువలలోని చెత్తను తొలగించాలని, వర్షపు నీరు సులభంగా ప్రవహించడానికి అడ్డంకులను తొలగించే బాధ్యత పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్​లపై ఉందని కలెక్టర్​ తెలిపారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్‌ కేసులు... ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details