మహబూబ్‌నగర్ జిల్లా మొకర్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ ముందు టైరు ఒక్కసారిగా పేలడం వల్ల అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహబూబ్‌నగర్‌కు వచ్చె క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా, బస్ డ్రైవర్, కండక్టర్లకు గాయాలయ్యాయి.
పేలిన లారీ టైరు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - mahabubnagar latest news today
రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ ముందు టైరు ఒక్కసారిగా పేలింది.. అంతే అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ మరణించగా, బస్ డ్రైవర్, కండక్టర్లకు గాయాలయ్యాయి.
పేలిన లారీ టైరు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వసమైంది. డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. గ్రామస్థుల సాయంతో పోలీసులు అతన్ని బయటకి తీశారు. చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద ఘటనను బస్సు డ్రైవర్ కాస్తా ముందుగానే గ్రహించడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెప్పారు.
ఇదీ చూడండి :ఆర్థిక లావాదేవీలే ఆనంద్‌రెడ్డిని చంపేశాయి : డీసీపీ మల్లారెడ్డి