మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ కురుమూర్తి ఆలయంలో.. రాజ గోపుర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిలు ఈ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
శరవేగంగా కురుమూర్తి ఆలయం రాజ గోపుర నిర్మాణ పనులు - ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి ఆలయం సరికొత్త రూపును సంతరించుకోనుంది. ప్రధాన ద్వారంలో.. నూతన రాజ గోపుర నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి.
శరవేగంగా కురుమూర్తి ఆలయం రాజ గోపుర నిర్మాణ పనులు
నిర్వాహకులు ఆలయ పాత ప్రధాన ద్వారాన్ని యంత్రాల సాయంతో నేలమట్టం చేసి, నూతన గోపుర నిర్మాణానికి పునాది పనులను ప్రారంభించారు. భక్తుల దర్శనార్థం.. ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర