విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం బలంపేటలోని కాస్తూర్బా వసతి గృహంలో విద్యార్థినిలు మధ్యాహ్న బోజనం వికటించి శనివారం అస్వస్థతకు గురయ్యారు.ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కస్తూర్బా వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందించాలని అన్నారు. వసతి గృహంలో భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న అటుకులలో పురుగులుండటం చూసి వసతి గృహ ప్రిన్సిపల్‌పై ఎమ్మెల్యే మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
వసతి గృహ ప్రిన్సిపల్‌పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం
మహబూబ్‌నగర్ జిల్లా కస్తూర్బా వసతి గృహంలో మధ్యాహ్న బోజనం వికటించి విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. నాణ్యమైన భోజనం అందించాలని వసతి గృహ ప్రిన్సిపల్‌పై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు.
వసతి గృహ ప్రిన్సిపాల్‌పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం