తెలంగాణ

telangana

ETV Bharat / state

Jupally on Palamuru Rangareddy Project : "ప్రచార ఆర్భాటం కోసం.. పాలమూరు ప్రాజెక్టును పూర్తయినట్లుగా చూపిస్తున్నారు" - Telangana latest political news

jupally on palamuru rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా.. 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తప్పని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సాగునీటిని అందించడానికి కాల్వల నిర్మాణమే పూర్తి చేయకుండా.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Jupally Fires on BRS
jupally on palamuru rangareddy Project

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 3:34 PM IST

Updated : Sep 9, 2023, 3:53 PM IST

Jupally on palamuru rangareddy Project : ఒక్క మోటార్​తో నీళ్లు ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అంత పూర్తయినట్టుగా.. కేసీఆర్(KCR)​ ప్రచార ఆర్భాటం చేస్తున్నారని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన జలాశయాల సందర్శనకు.. కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు జలాశయాల సందర్శనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్(Congress) నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

Palamuru Rangareddy Project Dry Run : తుదిదశకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు... వారం రోజుల్లో డ్రై రన్‌

సాగునీటి కాల్వలకు టెండర్లే పిలవకుండా, కాల్వల నిర్మాణమే పూర్తి కాకుండా సాగునీరు ఎలా ఇస్తారని జూపల్లి ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో జలశయాల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 60 నుంచి 70వేల కోట్లు కావాలని, ఇప్పటికి వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది 26వేల కోట్లేనన్నారు.

Jupally Fires on BRS :నార్లపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్​కు వచ్చే కాలువల నిర్మాణం కూడా పూర్తి కాలేదని.. ఇప్పటివరకు ప్రాజెక్టు 30% పనులు కూడా పూర్తి కాలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించిన భూ పరిహారం చెల్లింపులు పూర్తి స్థాయిలో జరగలేదని.. ఇంకా భూసేకరణ పెండింగ్​లోనే ఉందన్నారు. నిర్వాసిత రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదని ధ్వజమెత్తారు.

Palamuru Rangareddy Lift Irrigation Project : 'పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు'

Mahabubnagar Latest News : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఇవ్వాల్సిన లక్షా 40 వేల ఎకరాలకు నీరివ్వడం లేదని, పాలమూరు ప్రాజెక్టు కింద అప్పుడే 12లక్షల ఎకరాలకు సాగునీరెలా ఇస్తారన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి.. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యుసీ) నుంచి అనుమతుల రాలేదని.. పరిశీలనలో ఉందని గుర్తు చేశారు.

ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, పంపుల ఏర్పాటు కోసం గుత్తేదారుకు 2400 కోట్లు చెల్లిస్తే, అదే పనికి భేల్​(BHEL) 800 కోట్లకు చేస్తోందని పేర్కొన్నారు. కేవలం ప్రాజెక్టులోని పంపులు మోటార్లలోనే 1600కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రారంభోత్సం కేవలం 17న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభ ప్రాముఖ్యతను తగ్గించే కుట్రగా అభివర్ణించారు.

"పాలమూరు- రంగారెడ్డి ప్రాజెెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే.. ప్రచార ఆర్భాటం కోసం పూర్తయినట్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున కాంగ్రెస్​ కార్యకర్తలను హౌస్​ అరెస్ట్​ చేశారు. కాల్వల నిర్మాణమే పూర్తికాకుండా.. ప్రజలకు సాగునీరు ఎలా అందిస్తారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ఇంకా పెండింగ్​లోనే ఉంది. భూ పరిహారం చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు." - జూపల్లి, కాంగ్రెస్​ నేత

Jupally on Palamuru Rangareddy Project "ప్రచార ఆర్భాటం కోసం.. పాలమూరు ప్రాజెక్టును పూర్తయినట్లుగా చూపిస్తున్నారు"

Niranjan Reddy on Palamuru Rangareddy Project : పాలమూరుకు తీరనున్న కష్టాలు.. త్వరలోనే సాగునీళ్లు

CM KCR Review on Palamuru Rangareddy Project : ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్‌.. ప్రారంభించనున్న కేసీఆర్

Last Updated : Sep 9, 2023, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details