భాజపా సర్కారు శత్రువులపై సర్జికల్ స్ట్రైక్ చేస్తే... మిత్రున్నైన తనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దాడులు చేశారని ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. కమలం పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా మహబూబ్‌నగర్ వచ్చిన ఆయన స్వగృహంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి తనను వదిలేస్తే ప్రధాన మంత్రి అక్కున చేర్చుకున్నారని జితేందర్ అన్నారు. ఈ ఎన్నికలు ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జరుగుతున్నాయని... మోదీకి మాత్రమే ఆ అర్హత ఉందని పేర్కొన్నారు. భాజపా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
భాజపా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
కారు దిగి కాషాయం కప్పుకున్న జితేందర్‌రెడ్డి తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్రాలు కేంద్రంపై తప్పక ఆధారపడాల్సి వస్తుందన్నారు. 300లకు పైగా సీట్లు గెలిచి భాజపా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు