రోజురోజుకూ తగ్గిపోతున్న అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కొందరి నిర్లక్ష్యం వల్లే అడవులు నాశనమవుతున్నాయని తెలిపారు. మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'అడవులను సంరక్షించడం అందరి బాధ్యత'
అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మొక్కలు నాటడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన సూచించారు.
'అడవులను సంరక్షించడం అందరి బాధ్యత'
జిల్లాలో గతేడాది నాటిన మొక్కల్లో సుమారు 92 శాతం బతికాయని... అందుకు సహకరించిన వారిని అభినందించారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో కోటి విత్తన బంతులను తయారు చేసి... బంజరు, అటవీ భూముల్లో చల్లించామని తెలిపారు. ఏడు శతబ్దాల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని పూర్వ దశకు తీసుకువచ్చామని వెల్లడించారు. మయూరి ఎకో పార్క్‌లో కలెక్టర్ మొక్కలు నాటారు.
ఇదీ చదవండి:ప్రేమించానన్నాడు.. ఆ ఫొటోలతో బెదిరించాడు.. అలా బుద్ధి చెప్పా!