సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వల్ల మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఆర్సీ తండాకు చెందిన విద్యార్థి మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత బుధవారం కళాశాలలో అతడిపై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. ఆ విషయాన్ని తల్లితండ్రులకు తెలుపగా... కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.
సీనియర్ల ర్యాగింగ్‌తో విద్యార్థి ఆత్మహత్యా యత్నం - సీనియర్ల ర్యాగింగ్‌తో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన జడ్చర్ల సమీపంలోని ఆర్సీ తండాలో జరిగింది.
సీనియర్ల ర్యాగింగ్‌తో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
రోజు రోజుకు సీనియర్ల వెకిలి చేష్టలు ఎక్కువ కావడం వల్ల తీవ్ర మనస్తాపంతో శనివారం సాయంత్రం ఇంటికొచ్చాడు. వ్యవసాయ పొలంలోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీనియర్ల ర్యాగింగ్ వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలకున్నానని విద్యార్థి తెలిపాడు.
ఇదీ చూడండి: "బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"
TAGGED:
seniors raging