తెలంగాణ

telangana

యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకూడదు: కలెక్టర్ వెంకట్రావు

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లోని రెవెన్యూ సమావేశ మందిరంలో యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులు, హోల్​సేల్, రిటైల్ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

By

Published : Sep 3, 2020, 9:43 AM IST

Published : Sep 3, 2020, 9:43 AM IST

farmers-should-not-bother-for-urea-collector-venkatrao
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకూడదు: కలెక్టర్ వెంకట్రావు

వర్షాలు భారీగా కురవడం వల్ల ఈసారి వరి సాగు బాగా పెరిగిందని.. ఫలితంగా యూరియా వాడకం ఎక్కువైందని జిల్లా పాలనాధికారి వెంకట్రావు పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులు, హోల్​సేల్, రిటైల్ డీలర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు పోలీసులు సహకారం అందించాలన్నారు. డీలర్లకు, సొసైటీలకు సరఫరా చేసిన ఎరువుల వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details