తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆముదాలకు మద్దతు ధర కల్పించండి'

ఆముదాలకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతూ... దేవరకద్ర లోని జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో నిర్వహించారు.

By

Published : Sep 30, 2019, 5:48 PM IST

Updated : Sep 30, 2019, 5:58 PM IST

'ఆముదాలకు మద్దతు ధర కల్పించండి'

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తారొకో నిర్వహించారు. ఆముదాలకు సరైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత వారం వరకు క్వింటా ఆముదాలకు గరిష్టంగా రూ. 5200 వరకు ఉండగా... ప్రస్తుతం రూ.3900 నుంచి 4200 వరకు మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు వెయ్యి రూపాయలు తగ్గించడం సరికాదని చెప్పారు. అన్నదాతల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనను విరమించాలని కోరారు. ఎంతచెప్పినా వినకపోవడం వల్ల ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి రైతులను మార్కెట్​ వర్గాల​తో మాట్లాడించారు. అనంతరం పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

'ఆముదాలకు మద్దతు ధర కల్పించండి'
Last Updated : Sep 30, 2019, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details