తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యప్ప ఆలయ అభివృద్ధికి కృషి : శ్రీనివాస్ గౌడ్ - మహబూబ్​నగర్ జిల్లాలో అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్​నగర్​ జిల్లాకేంద్రంలోని అయ్యప్పకొండపై కన్నులపండువగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

Efforts for the development of Ayyappa Temple in mahaboob nagar by minister Srinivas Gowd
అయ్యప్ప ఆలయ అభివృద్ధికి కృషి : శ్రీనివాస్ గౌడ్

By

Published : Dec 26, 2020, 9:31 AM IST

మహబూబ్​నగర్ జిల్లాకేంద్రంలోని అయ్యప్ప కొండపై నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతికి చెందిన వెంకటేశ్వరశర్మ గురుస్వామి వేద, మంత్రోచ్ఛారణల మధ్య అయ్యప్ప ఆలయంలో ఏకశిలా పదునెట్టాంబడి పూజను ఘనంగా నిర్వహించారు. స్వామివారి భక్తిగీతాలు ఆలపిస్తూ పడిపూజ భక్తుల కళ్లకు కట్టేలా వివరించారు. మణికంఠస్వామిని కొలిచిన వారికి సకలసౌభాగ్యాలు కలుగుతాయని స్వామిజీ ప్రబోధించారు.

తనవంతు సాయం అందిస్తా: మంత్రి

అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక మందిరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పాలమూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:యాదాద్రిలో వైభవంగా అధ్యయనోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details