దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు ఆశాజనకంగా పెరిగాయి. రైతులకు కొంత ఊరటనిచ్చేలా ప్రస్తుత ధరలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం క్వింటా ఉల్లి రూ.650 నుంచి రూ. 900 వరకు కొనసాగింది. నాణ్యమైన ఉల్లికి క్వింటాకు రూ. 1000 నుంచి రూ. 1200 వరకు పలుకుతోంది. గత నెలతో పోలిస్తే ఏప్రిల్లో కాస్తా ధరలు పెరగడం వల్ల రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.నెల రోజులుగా ధరలు పెరగడం, విక్రయానికి తక్కువగా రావడం వల్ల ఉల్లికి మంచి డిమాండ్ ఏర్పడింది.
దేవరకద్ర మార్కెట్లో ఆశాజనకంగా ఉల్లి ధర - Devarakadra
దేవరకద్ర మార్కెట్లో ఉల్లి మంచి ధర పలుకుతోంది. నెలరోజులుగా పెరిగిన ధరలతో రైతులకు కాస్తా ఊరట లభిస్తోంది.
ఆశాజనకంగా ఉల్లి ధర