Jurala Project Pending Work in Gadwal :ఉమ్మడి పాలమూరు జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కృష్ణానది నుంచి ఏటా వచ్చే వేల క్యూసెక్కుల నీరు ఆ ప్రాజెక్టు నుంచే దిగివకు విడుదలవుతుంది. ఎంతో ప్రాధాన్యమున్న జూరాల క్రస్టు గేట్ల మరమ్మతులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఆనకట్టకు మొత్తం 62 గేట్లుంటే.. వాటి మరమ్మతులకు మాత్రం.. ఒకే ఒక్క గ్యాంటీ క్రేన్ అందుబాటులో ఉంది. ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడే అమర్చారు. 20ఏళ్లలో అనేక సార్లు మరమ్మతులు కాగా బాగుచేసి తిరిగి పనులు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఆ కారణంగా క్యాంటీక్రేన్ సాయంతో చేపట్టాల్సిన క్రస్ట్‌గేట్ల మరమ్మతుల్లో ఆలస్యం జరుగుతోంది.
Jurala project Work Delay at Kuravpur :ఒక్కో గేటు 12 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. నీటి ప్రవాహం కారణంగా గేట్లు బలహీనం కావడం, తుప్పుపట్టడం, లాక్స్ సరిగా లేక నీళ్లు లీకేజీ కావడం ఇతర సాంకేతిక పరమైన మరమ్మత్తులకు గురవుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి స్టాప్ లాక్ వేసి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. కాని వాటికి వినియోగించే పరికరకాలు తరచూ రిపేర్లు రావడం పనులకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ప్రస్తుతం రాక్ సాండ్ స్ప్రేయింగ్ ద్వారా తుప్పును వదిలించే పనులు చేపట్టారు. జులై నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా, ఆలస్యం కావడంతో ఈ వానాకాలం వదిలి వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jurala project Work Budget in Gadwal : గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటి వరకు రూ.3 కోట్ల విలువైన మరమ్మతులు మాత్రమే పూర్తయ్యాయి. పాతది మార్చి కొత్త గ్యాంటీ క్రేన్ ఏర్పాటు చేస్తే గేట్ల మర్మమతులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అదనపు గ్యాంటీ క్రేన్ కావాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా ప్రాజెక్టు అధికారులు చెప్పారు.