తెలంగాణ

telangana

ETV Bharat / state

పది రోజుల్లోనే పంటల నమోదు కార్యక్రమం పూర్తి - రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి జనార్దన్ రెడ్డి

కేవలం పది రోజుల్లోనే పంటల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి... మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 90 వేల ఎకరాల పంటల వివరాలను జిల్లా వ్యవసాయశాఖ ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేసింది.

crop registration program completed in mahabubnagar
పది రోజుల్లోనే పంటల నమోదు కార్యక్రమం పూర్తి

By

Published : Aug 2, 2020, 10:44 AM IST

మహబూబ్ నగర్ జిల్లాలో పంటల నమోదు కార్యక్రమాన్ని పది రోజుల రికార్డు సమయంలో పూర్తి చేసినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. పంటల నమోదు ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ఈ సంవత్సరం పంటలు నమోదును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని తెలిపారు. జులై 21న ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పది రోజుల్లోనే జిల్లాలో సాగు చేసిన సుమారు 2 లక్షల 90 వేల ఎకరాల పంటల వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ ఆన్​లైన్​లో నమోదు చేసింది.

నిర్దేశించిన సమయంలో పంటల వివరాల నమోదు పూర్తి చేసినందుకుగాను జిల్లా వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట రావు అభినందించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిరోజు 350 నుంచి 400 మంది రైతులకు సంబంధించిన పంటల వివరాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సేకరించడం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సేకరించిన వివరాలన్నింటిని ఆన్​లైన్​లో నమోదు చేశారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత తెలిపారు. అందువల్లే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details