ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ జిల్లా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రోజుకు వందకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జులై 25న అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 49 మంది కొవిడ్ బారిన పడగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో 18 మంది, నాగర్‌కర్నూల్ జిల్లాలో 36 మంది, వనపర్తి జిల్లాలో 11 మంది, నారాయణపేట జిల్లాలో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 49 మందికి పాజిటివ్ రాగా.. అందులో జిల్లా కేంద్రానికి చెందిన వారే 38 మంది ఉన్నారు. ఐజ, గద్వాల, వడ్డేపల్లి మండలాలకు చెందిన 11 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 36 కేసులు నమోదు కాగా.. కేవలం జిల్లా కేంద్రంలోనే 13 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. అచ్చంపేట మండలంలో 9 మంది, బిజినేపల్లి మండంలో నలుగురు, పెంట్లవెల్లిలో ముగ్గురు, కొల్లాపూర్లో ముగ్గురు, అమ్రబాద్‌లో ఇద్దరికి, కల్వకుర్తి, పదరలో ఒక్కొక్కరికి కొవిడ్-19 నిర్ధారణ అయ్యింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 18 పాజిటివ్ కేసులు రాగా... పట్టణం కేంద్రంలోనే 14 మంది కరోనా బారిన పడ్డారు. జడ్చర్లకు చెందిన ఇద్దరు, గండీడ్, కోయిల్‌కొండ మండలాలకు చెందిన ఒక్కొక్కరికి వైరస్ సోకింది.
వనపర్తి జిల్లాలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలో ఎనిమిది మందికి కొవిడ్-19 సోకింది. కొత్తపల్లిలో ఒకే కుటుబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పెబ్బేరు, మదనాపురం, కొత్తకోట మండలాల్లో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు. నారాయణపేట జిల్లాలో ఇద్దరికి వైరస్ సోకగా.. వారు మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన వారిగా తేలింది.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు