ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కనాడు 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 58, నాగర్‌కర్నూల్ జిల్లాలో 57, జోగులాంబ గద్వాల జిల్లాలో 40, నారాయణపేట జిల్లాలో ఏడుగురు, వనపర్తి జిల్లాలో నలుగురు కొవిడ్ బారిన పడ్డారు. తాజా కేసులతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1736కు చేరింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో...
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 32 మంది కరోనా బారిన పడగా.. పట్టణంలోని మర్లు, న్యూగంజ్‌లో ఒకే కుటుంబంలో నలుగురు చొప్పున కరోనాకు గురయ్యారు. జడ్చర్ల పట్టణంలో 16 మందికి పాజిటివ్ రాగా.. సీసీకుంట మండలంలో ఐదు మంది, భూత్పూర్లోని కొత్త మొల్గరలో ఒకరికి కరోనా సోకింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో...
నాగర్‌కర్నూల్ పట్టణంలో 13, అచ్చంపేట మండలంలో 22, కల్వకుర్తి మండలంలో 9, అమ్రబాద్‌లోని ఈగలపెంటలో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. యెన్మన్‌బెట్లలో ముగ్గురు, కొల్లాపూర్, పెంట్లవెల్లి, బల్మూరు, బిజినేపల్లి, తిమ్మాజీపేటలో ఒక్కొక్కరు కొవిడ్ బారిన పడ్డారు.