ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. విడివిడి జిల్లాల విషయానికొస్తే.. శుక్రవారం నాడు జోగులాంబ గద్వాల జిల్లాలో 73 కేసులు నమోదుకాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 44, నాగర్‌కర్నూల్ జిల్లాలో 41, నారాయణపేట జిల్లాలో 10, వనపర్తిలో జిల్లాలో ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2293 కు చేరింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో 73 కొవిడ్-19 కేసులు నమోదుకాగా.. అందులో 8 కేసులు జిల్లా కేంద్రంలోనే నమోదయ్యాయి. మావనపాడులో 3, ఉండవల్లి, ఇటిక్యాల మండలంలో రెండేసి చొప్పున కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్‌సీలలో ర్యాపిడ్ యాంటిజిన్ పరీక్షలు నిర్వహించగా.. 60 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 44 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోనే 17 మందికి పాజిటివ్ రాగా.. అందులో ఒకరు మృతి చెందారు. జడ్చర్ల, బాదేపల్లిలో 17 మంది కొవిడ్ బారిన పడగా.. భూత్పూర్ మండలం గొప్లాపూర్, కోయిల్‌కొండ మండలం పెర్కివీడు, రాజాపూర్ మండలంలో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు. జానంపేట, నవాబుపేట, హన్వాడ మండలాల్లో ఒక్కో కేసు నమోదయింది.