ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండు వేల కేసులు నమోదు కాగా.. గురువారం ఒక్క రోజే ద్విశతకం దాటాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనే వందకు చేరువలో 95 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 64 మంది, నాగర్‌కర్నూల్ జిల్లాలో 58, వనపర్తిలో జిల్లాలో 23, నారాయణపేట జిల్లాలో ఐదు మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2117 కు చేరింది. జడ్చర్ల శిక్షణాకేంద్రంలోని 54మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. బుధవారం 10 మంది శిక్షణ కానిస్టేబుళ్లు పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది గురువారం మిగిలిన కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా మరో44 మందికి కరోనా సోకినట్లు తేలింది.
ఉమ్మడి మహబూబ్నగర్లో విజృంభిస్తున్న కరోనా
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. గురువారం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్లో విజృంభిస్తున్న కరోనా