పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంతో పాటు నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ నామినేషన్ - మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామపత్రాలు సమర్పించారు. హస్తం అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో చిన్నారెడ్డి బరిలో నిలుస్తున్నారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి చిన్నారెడ్డి నామినేషన్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానని చిన్నారెడ్డి తెలిపారు. ఆరేళ్లు ఎమ్మెల్సీగా ఉండి భాజపా అభ్యర్థి సాధించింది ఏమి లేదని అన్నారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలను తెరాస ప్రభుత్వ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.
Last Updated : Feb 16, 2021, 8:27 PM IST