తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవరకద్రలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం - ప్రదీప్ కుమార్ గౌడ్

సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ... పాలమూరు జిల్లా దేవరకద్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

By

Published : Jun 7, 2019, 4:54 PM IST

సీఎల్పీ విలీనానికి నిరసనగా మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఆపార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి ఆ తర్వాత దిష్టిబొమ్మ తగలబెట్టారు. సంతలో పశువులను కొన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ప్రదీప్ కుమార్ మండిపడ్డారు. ప్రజలే తెరాసకు బుద్ది చెప్తారని జోస్యం చెప్పారు.

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

ABOUT THE AUTHOR

...view details