ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. మహబూబ్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ఆధ్వర్యంలో జిల్లాలోని దుకాణాలను పార్టీ శ్రేణులు మూసివేయించారు. బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కమిషన్లకు కక్కుర్తి పడి కేఎల్ఐ పంప్‌హౌజ్‌కు దగ్గర్లోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగ మార్గాన్ని నిర్మించారని, అక్కడి పేలుళ్ల వల్లే పంప్హజ్ నీటమునిగిందని కొత్వాల్ ఆరోపించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ధర్నా - congress party leaders protest
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎల్లూరు లిఫ్ట్‌లో పంప్‌హౌజ్ నీట మునిగిన వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎల్లూరు పంప్‌హౌజ్ ప్రమాదం పట్ల తెరాస ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
పంప్‌హౌజ్‌ను పరిశీలిస్తామని ఎంపీలు, ప్రతిపక్ష నేతలు వస్తే అడ్డుకోవడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ప్రమాదం ఎలా జరిగిందో సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు అందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి సమీప పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఇదీ చదవండి:రామాంతపూర్‌లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి