తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేటలో కలపొద్దు - mahaboobnagar

కోయిల్​కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో విలీనం చేయవద్దని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. సంయుక్త కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు.

కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తున్న కోయిల్​కొండ వాసులు

By

Published : Feb 11, 2019, 9:12 PM IST

కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తున్న కోయిల్​కొండ వాసులు
కోయిల్​కొండను కొత్తగా ఏర్పాటు చేయనున్న నారాయణపేట జిల్లాల్లో కలపొద్దని స్థానికులు నిరసన చేపట్టారు. మండల సరిహద్దు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎన్నిసార్లు ఆందోళన, నిరసనలు చేసిన అధికారులు స్పందించడం లేదని వాపోయారు. మహబూబ్​నగర్​ జిల్లాతోనే తమ మండలం అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ కొత్తపల్లి రవి అన్నారు.
జిల్లా కేంద్రానికి చేరుకోగానే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని నిలువరించడంతో అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. మహబూబ్​నగర్ జిల్లా తమకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటే.. నారాయణ పేట 60 కిలోమీటర్ల దూరంలో ఉందని సింగిల్ విండో డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అనంతరం ప్రజా ప్రతినిధులు సంయుక్త కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details