తెలంగాణ

telangana

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ.. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగులు తమకు కేటాయించిన విధులను సకాలంలో పూర్తి చేసేందుకు శ్రద్ధతో పని చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

By

Published : Nov 20, 2020, 6:07 PM IST

Published : Nov 20, 2020, 6:07 PM IST

Collector S. Venkata Rao conducted a inspection of government offices in the district headquarters of Mahabubnagar.
కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ.. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశం

మండల, గ్రామస్థాయి, జిల్లా స్థాయి కార్యాలయాలలో తరచు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ జిల్లాలో నిరంతరం కొనసాగుతుందని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ డివిజినల్‌ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయాల్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సిబ్బంది అంతా సకాలంలో కార్యాలయాలకు హాజరుకావాలని, అధికారులు ముందస్తు అనుమతి లేకుండా సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు, డీఆర్‌వో, అటవీ, వ్యవసాయ, జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని వివిధ మండల, గ్రామ స్థాయి కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details