టీవీల్లోనో, మొబైల్లోనే డిజిటల్ పాఠాలు వినాల్సిన విద్యార్ధులు పొలం బాట పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఇళ్లలో పాఠాలు వినాల్సిన విద్యార్థులు పొలాల్లో కూలీలుగా దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం వరి, పత్తి, మిరప, కూరగాయలు సహా వివిధ పంటల్లో కలుపుతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సొంతంగా పొలాలున్న తల్లిదండ్రులు ఈ పనుల కోసం ఆన్‌లైన్ పాఠాలు వినాల్సిన తమ పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్తున్నారు. సాగుభూమి లేకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేసే నిరుపేద కుటుంబాలు తమ పిల్లల్ని కూలీలుగా తమవెంట తీసుకువెళ్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కుర్వపల్లి శివారులో ఇద్దరు విద్యార్థులు మిరపచేనులో కలుపుతీస్తూ కనిపించారు. వ్యవసాయ కూలీగా పనిచేసే మహిళ తన అత్తతో పాటు కుమారుడు, అల్లుడిని కూలీ పని కోసం తీసుకువచ్చారు. కలుపుతీస్తే రోజుకు 250 రూపాయలు వారికి చెల్లిస్తారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడంతో కుమారుడిని తల్లి కూలీకి తీసుకువచ్చారు. కూలీ చేశాక సమయం దొరికితే ఆన్‌లైన్ పాఠాలు వింటామని విద్యార్థులంటున్నారు.
కలుపుతీస్తూ కనిపిస్తున్న పిల్లలు
అదే కుర్వపల్లి గ్రామానికి మరో విద్యార్ధి జడ్చర్లలోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం 6గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 6గంటల నుంచి 10గంటల మధ్యలో ఆన్‌లైన్ తరగతులు వింటున్నాడు. మిగిలిన సమయంలో వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ప్రైవేటు పాఠశాలలో చదివే అతని సోదరునికి తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు వినడం లేదు. తనూ మిరపచేలో కలుపుతీస్తూ కనిపించాడు.
పొలాల్లోనే గడుపుతున్న విద్యార్థులు
జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి సాగులో ఆగస్టు మాసం క్రాసింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి కూలీల అవసరం ఎక్కువ. మొగ్గలు గిల్లడానికి, మగ,ఆడ పుష్పాల మధ్య పరపరాగ సంపర్కం జరపడానికి కూలీలు అవసరమవుతారు. రోజుకూ ఒక్కో కూలీకి 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు పిల్లల్ని క్రాసింగ్ కోసం తీసుకువెళ్తారు. ఆగస్టు మాసం వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నత పాఠశాల్లో హాజరుశాతం 30శాతానికి పైగా పడిపోతూ ఉండేది ప్రస్తుతం బడులు మూసి ఉండటంతో విద్యార్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పత్తిచేళ్లలోనే గడుపుతున్నారు. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి చదివే విద్యార్ధులు ఎక్కువ శాతం పొలాల్లోనే గడుపుతున్నారు. ఇంటికి తిరిగొచ్చి ఆన్‌లైన్ పాఠాలు విందామన్నా అప్పటికే అలసిపోవడంతో పాఠాలు బుర్రకెక్కడం లేదు.
పొలంబాట పట్టేందుకు కారణాలు..