వినియోగదారుల అభిరుచులను బట్టి వివిధ రకాల చాయ్‌లు చేస్తున్నారు. అల్లం టీ, పుదినా టీ, నిమ్మకాయ టీ, ఇరానీ, మలై చాయ్‌లు, గ్రీన్ టీ, మసాల టీ, బాదం టీ, మిల్క్ ఘావాతో పాటు వివిధ రకాల కాఫీలు లభిస్తున్నాయి. ఆదాయం బాగుండటంతో యువకులు కూడా టీస్టాళ్ల ఏర్పాటు (Chai business) పై దృష్టి పెడుతున్నారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే ప్రత్యేక టీస్టాళ్లు (Chai business) సుమారు 280 వరకు ఉన్నట్లు అంచనా. న్యూటౌన్‌లో ఓ స్టాల్ యజమాని రోజుకు 2 వేల నుంచి 2,500 వరకు టీ (Chai business) లు విక్రయిస్తున్నారు. సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వ్యాపారం (Chai business) నడుస్తోంది. ఇంతటి వ్యాపారం సాగే దుకాణాలు మహబూబ్‌నగర్ పట్టణంలోనే సుమారు వందకు పైగా (Chai business) ఉన్నాయి. ఇక ప్రధాన వ్యాపార కేంద్రాలైన జడ్చర్ల, వనపర్తి, గద్వాలలోనూ వ్యాపారం ఇలాగే సాగుతోంది.
పల్లె నుంచి బస్తీల దాకా..
ఏ చిన్న పల్లెకు పోయినా టీ దుకాణాలు తప్పని సరిగా ఉంటున్నాయి. ఇప్పుడు కొన్ని సంస్థలు ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టడంతో యువత ఆయా కంపెనీల టీదుకాణాలు పెట్టుకొని రోజుకు రూ.వేలల్లో ఆదాయం పొందుతున్నారు. జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాల్లో అయితే గల్లీగల్లీలో ఈ టీ దుకాణాలు (Chai business) వెలిశాయి. ఉమ్మడి జిల్లాలో హోటళ్లు కాకుండా ప్రత్యేకంగా టీ దుకాణాలే (Chai business) సుమారు 8,500లకు పైగా ఉన్నట్లు అంచనా. రోజుకు 25.50 లక్షల కప్పు చాయ్ అమ్ముడుబోతున్నట్లు టీస్టాల్ నిర్వాహకులే చెబుతున్నారు. సాధారణ సింగిల్ టీ రూ.8 మొదలు కొని చేసే విధానం, రుచిని బట్టి ఇప్పుడు కొత్తగా వెలుస్తున్న స్టాళ్లలో ఒక టీ రూ.10 నుంచి రూ.50 వరకు కూడా ఉంది. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో కలిపి రోజుకు రూ.2.50 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోంది. అంటే నెలకు రూ.76.50 కోట్లు బయట టీ తాగడానికే ఖర్చు చేస్తున్నారు.
కార్పొరేట్ స్టాళ్లు..
ఇటీవల టీ వ్యాపారం కార్పొరేట్ రంగు పులుముకొంది. కొన్ని ప్రత్యేక కంపెనీలు యువకులకు టీస్టాళ్లు పెట్టించి.. వారికి రెండు నెలలు శిక్షణ ఇచ్చి వ్యాపారం పెట్టిస్తున్నారు. టీపొడి, పాలు మొదలు అన్నీ ఆయా కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులపై స్టాళ్లు పెట్టిస్తున్నారు. మంచి ఆదాయం ఉండటంతో యువత కూడా ఈ వ్యాపారం (Chai business) వైపు ఆకర్షితులవుతున్నారు. ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. అన్ని పట్టణాల్లో ఈ దుకాణాలు (Chai business) వెలిశాయి.
రోజుకు నాలుగు తాగుతా...
నేను రోజుకు నాలుగు టీలు తాగుతా. అది కూడా కేవలం అల్లం చాయ్ మాత్రమే. ఉదయం ఇంట్లో తాగి వచ్చినా.. బయట టీ తాగడానికి ఇష్టపడతా. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం తిరిగి తిరిగి అలసట అనిపించినప్పుడు చాయ్ తాగితే ఎంతో ఉపశమనంగా అనిపిస్తోంది. తిరిగి శక్తి వచ్చి మళ్లీ పనిలో నిమగ్నమైపోతా.
- పల్లె రవి, క్రిస్టయన్‌పల్లి, మహబూబ్‌నగర్
సొంతూళ్లో స్వయం ఉపాధి..
కుటుంబానికి దూరంగా ఉంటూ హైదరాబాద్‌లో దాదాపు పదేళ్లు పని చేశా. సొంతూళ్లోనే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని భావించా. స్నేహితుల సలహాతో 2019 నవంబరులో నారాయణపేటలో కాఫీ హౌస్ ప్రారంభించా. హైదరాబాద్, బెంగళూర్ తదితర నగరాల్లో లభించే కాఫీ, టీలకు తీసినిపోని విధంగా ఇక్కడ టీ తయారు చేస్తున్నా. వ్యాపారం బాగుంది. రోజుకు రూ.15 వేలకు పైగా ఆదాయం (Chai business) వస్తోంది.