తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంత్రి అఫిడవిట్‌ తొలగింపు'పై ఈసీకి నివేదిక - మంత్రి అఫిడవిట్‌

Minister Affidavit Removal: 2018లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లు దాఖలు చేశారని, అందులో ఒకదాన్ని తొలగించారంటూ సి.రాఘవేంద్రరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై నివేదిక పంపాల్సిందిగా సీఈసీ తెలంగాణ అధికారులను కోరింది.

Minister Affidavit Removal
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫడవిట్

By

Published : Jan 26, 2022, 9:19 AM IST

Minister Affidavit Removal: రాష్ట్రంలో 2018లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అఫిడవిట్‌ తొలగించారన్న ఫిర్యాదుపై ఆ జిల్లా కలెక్టరు ఇచ్చిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లు దాఖలు చేశారని, అందులో ఒకదాన్ని తొలగించారంటూ సి.రాఘవేంద్రరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై నివేదిక పంపాల్సిందిగా సీఈసీ తెలంగాణ అధికారులను కోరింది. ఆ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక పంపాల్సిందిగా కోరారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వాటితో పాటు 4 దఫాలు అఫిడవిట్లు దాఖలు చేయవచ్చు. తొలగింపు అన్నది సాఫ్ట్‌వేర్‌ వ్యవహారమని వచ్చిన ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి గత నెలలోనే పంపినట్లు గోయల్‌ తెలిపారు. ఈ అంశంపై దిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది. కోర్టులో జరిగిన తాజా పరిణామాలపై తమకు సమాచారం లేదన్నారు. గతంలో ఎన్నికల సంఘం అమలు చేసిన జనసిస్‌ అనే సాఫ్ట్‌వేర్‌లో లోపమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ లోపాన్ని 2019లో గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం దాని స్థానంలో ఎన్‌కోర్‌ అనే మరో సాఫ్ట్‌వేర్‌ను తీసుకువచ్చింది. ఆ సమయంలో ఎన్నికలు జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సమస్య వచ్చినట్లు ఓ అధికారి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details